May 02,2023 21:18

పరిశీలిస్తున్న రైతు సంఘాల నాయకులు

పరిశీలిస్తున్న రైతు సంఘాల నాయకులు
గడ్డివామి దగ్ధం
రూ.2లక్షల ఆస్తినష్టం
కోవూరు:పట్టణంలోని కొత్తూరు ఉలసాగు మేకాలమ్మ గుడి ప్రాంతంలో ఇంతా శ్రీకాంత్‌ రెడ్డి కౌలు రైతు అప్పు చేసి డెయిరీ ఫామ్‌ ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నాడు. గత కొంతకాలంగా ఆ ప్రాంతంలో తాగుబోతులు మోటార్‌ వైర్లు దొంగలిస్తున్నారు. దీంతో రైతులందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతంలోని మోటార్‌ వైర్లు దొంగలిస్తున్నారని అడిగినందుకు కౌలు రైతు అయిన శ్రీకాంత్‌ రెడ్డిని టార్గెట్‌ చేస్తూ 20 రోజుల క్రితం 20 ఎకరాల గడ్డివాములను దగ్ధం చేశారు. మళ్లీ సోమవారం అర్ధరాత్రి 40 ఎకరాల గడ్డివాములను తగలబెట్టారు. ఈసందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎప్పుడు ఇటువంటి ఘటనలు జరగలేదన్నారు.. దురదష్టకరం పలుదపాలుగా పోలీసులకు విన్నవించి నివారించమని కోరినా ఫలితం శూన్యమన్నారు. ప్రభుత్వమే ఈ అసాంఘిక శక్తులను ప్రోత్సహించి కల్తీ మద్యాన్ని అక్రమ గంజాయి వ్యాపారాన్ని నడుపుతున్నాయని ప్రజలు
చర్చించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన ఎస్‌పి తిరుమలేష్‌ రెడ్డి గంజాయిని పట్టుకోవడం ఇందుకు నిదర్శనమన్నారు. అక్రమ గంజాయి, మద్యం, మైనింగుల్లో అధికార పార్టీ యంత్రాంగానికి విచ్చలవిడిగా కమీషన్లు అందుతున్నాయన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అసాంఘిక కార్యకలాపాల పైన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కౌలు రైతు సంఘం, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కోరారు. గడ్డివామిని పరిశీలించిన వారిలో గండవరపు శేషయ్య, ఎస్‌కె. బాబు, జి.బుజ్జయ్య, వి.మల్లికార్జునరెడ్డి, బి. పెద్దన్న, జి.విజరు కుమార్‌, పి.సురేంద్ర, టి.రమేష్‌, షేక్‌ కాలేషా, షేక్‌ కరీముల్లా, ఎన్‌.మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.