కరపత్రాలు ఆవిష్కరిస్తున్న నాయకులు
ప్రజాశక్తి-కందుకూరు : హర్ దిల్ మే వైఎస్‌ఆర్ హమ్ సబ్ జగన్ కే సాత్ కార్యక్రమంలో భాగంగా గురువారం కందుకూరు పట్టణంలోని ఉప్పుచెరువు వద్దవున్న గఫూరియ మసీదులో హర్ దిల్ మే వైఎస్‌ఆర్ హం సబ్ జగన్ కె సాత్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వక్ఫ్‌బోర్డు సభ్యులు సంధాని బాష మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అన్నారు, ఇమామ్ మౌజన్ల గౌరవ వేతనం, మసీదుల్లో మౌలిక వసతుల కల్పనపై నివేదికను ఇచ్చామన్నారు. మసీదుల్లో ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనం ఇవ్వాలని వినతిపత్రాలు అందజేశారు. వైసిపి పట్టణ అధ్యక్షులు రఫీ ,రహీం, బాబు , యూసుఫ్,నసీర్,ఆసీఫ్,జాకీర్ పాల్గొన్నారు.










