Feb 02,2023 18:27

విద్యార్థలను అభినందిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -కందుకూరు :దేశంలో నేరాల పరిశోధనకు, నేర నియంత్రణకు, పోలీస్‌ న్యాయ వ్యవస్థకు సహకరించే ఫోరెన్సిక్‌ నిపుణులు మూడేళ్ల బిఎస్‌సి ఫోరెన్సిక్‌ సైన్సు కోర్సులకు ప్రతి ష్టాత్మకంగా నిర్వహించే జాతీయ ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్స్‌కు జాతీయ స్థాయిలో జనవరి 29న నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో కందుకూరులోని గాయత్రి ఐ.ఐ.టి, నీట్‌ అకాడమీ విద్యార్థులు ప్రతిభ చూపారు.సీనియర్‌ బైపిసి విభాగంలో ఎస్‌.చైత్రవి, ఎస్‌.కె.ఆశ్రీన్‌, ఎస్‌.కె .మోహసీన్‌, డి.సాయి మదన్‌ ఆన్‌లైన్‌ ఎంట్రన్స్‌ పరీక్షలో పాల్గొని సీటు సాధించారు. ఐ.ఐ.టి క్యాంపస్‌లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో నలుగురు విద్యార్థులను ఆ విద్యా సంస్థల అధినేత సి.ఎచ్‌.రామకష్ణ రావు అభినందించారు. గాయత్రీ విద్యాసంస్థల డైరెక్టర్‌ సి.ఎచ్‌.భరద్వాజ్‌, గాయత్రీ ఐ.ఐ.టి ప్రిన్సిపాల్‌ ఎస్‌.రాంబాబు మాట్లాడారు. గాయత్రీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ పి.గీతా శ్రీనివాస్‌ పాల్గొన్నారు.