Jan 10,2023 18:56

సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులు

ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరు గాయత్రీ కాలేజ్‌ కరస్పాండెంట్‌ రామకష్ణ ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా మంగళ వారం జరిగాయి. ముగ్గులపోటీలు, కుర్చీలాటలు,జానపదపాటులు నిర్వహించారు. కబడ్డీ, కోకో,క్రికెట్‌ వంటటి పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపాల్స్‌ ఉషాచంద్రిక, గీతా శ్రీనివాసరావు, డైరెక్టర్‌ భరధ్వాజ్‌, లెక్చరర్లు పాల్గొన్నారు.