Mar 17,2023 21:35

ఫొటో : మాట్లాడుతున్న పశుసంవర్థక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గురుజయంతి

గాలికుంటువ్యాధికి టీకాలు
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలో మూడో విడత గాలికుంటు వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని పశుసంవర్థక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గురుజయంతి ప్రారంభించి పశువులకు వ్యాక్సిన్లు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ టీకాలు పశువులకు వేయడం వల్ల గాలికుంటు వ్యాధి రాకుండా ఉండేందుకు వీలుంటుందని పాడి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గాలికుంటూ టీకా వేయడం వల్ల పశువులకు ఎటువంటి సమస్యలు రావని అపోహలు పెట్టుకోవద్దన్నారు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.