May 21,2023 22:20

రామాపురం : నేలకొరిగిన ట్రాన్స్‌ఫార్మర్‌

ఆదివారం సాయంత్రం గాలివాన బీ భత్సం సృష్టించింది. అన్నమయ్య జిల్లాలోని గాలి వీడు, రామాపురం, కలికిరి, నిమ్మనపల్లి, లక్కిరెడ్డిపల్లె, నందలూరు, తదితర మండలాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీనికి గాలి తోడవడంతో అక్కడక్కడా చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో సుమారు గంటన్నరపాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వేగంగా వీచిన గాలికి కలికిరి మం డలంలో మామిడి చెట్లు, కాయలు నేలకొరిగాయి. దీంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది.
- ప్రజాశక్తి- యంత్రాంగంనేలకొరిగిన మామిడి, వరి..
కలికిరి : గాలివాన బీభత్సంతో మండలంలోని మామిడి చెట్లు నెలకొరిగాయి. కాయలు నేలరాలిపోవడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ట్రాన్స్‌ఫార్మర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటితోపాటు గాలివానకు మామిడి తోటల్లో కాయలు నేలరాలడంతో బాధిత రైతులకు లక్షల్లోనష్టం వాటిల్లింది. వందల ఎకరాల్లో వరిమళ్లు కోతకు వచ్చే సమయంలో నేలమట్టమయ్యాయి. గుట్టపాలెం పంచాయతీ ఆచార్ల గొల్లపల్లిలో వెంకటప్పకు చెందిన వ్యవసాయ బోరు ట్రాన్స్‌ఫార్మర్‌ కిందపడిపోగా, మరో రైతులకు చెందిన రెండు విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి.
విరిగిపడ్డ చెట్లు ..
నిమ్మనపల్లి : గాలివాన బీభత్సానికి మండలంలోని పలుచోట్ల భారీవక్షాలు విరిగి పడ్డాయి. ఆదివారం సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో తీవ్రమైన గాలులతో మోస్తారుగా వర్షం కురిసింది. గాలుల తాకిడికి నిమ్మనపల్లి - కందూరు రోడ్డు మార్గంలోని పలు చోట్ల పెద్ద చెట్లు రోడ్డుకు అడ్డంగా విరిగిపడ్డాయి. సైదాపేటకు సమీపంలో చింత చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడడంతో రోడ్డుపై ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు నిలి చాయి. దీంతో ఇతర ప్రాం తాలకు వెళ్లాల్సిన ప్రయా ణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వడగండ్ల వాన..
గాలివీడు : ఆది వా రం సాయంత్రం అరగంటసేపు ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. గాలులు బలంగా వీచడంతో వేళ్లతో సహా చెట్లు నేలకొ రిగాయి. మధ్యాహ్నం వరకు ఎండ వేడిమితో అల్లాడిని ప్రజలకు ఒక్కసారిగా వాతా రణం మారడంతో కొంత ఉపసమనం కల్గింది.
రామాపురం : మండలంలోని నల్లగుట్టపల్లి గ్రామం కొత్తపల్లి సమీపంలో ఈదురు గాలుల ధాటికి విద్యుత్‌ స్తంభం, ట్రాన్స్‌ఫార్మర్‌ నేలకొరిగాయి. కొత్తపల్లి గ్రామస్తులు విద్యుత్‌ అధికారులకు ఫోన్‌ద్వారా సమాచారం అందించడంతో వారు విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు. మరమ్మతులు చేసి గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు.
లక్కిరెడ్డిపల్లి : ఆదివారం సాయంత్రం గాలులతో కూడిన వర్షం కురవడంతో మండల కేంద్రంలోని పాత కోర్టు, కస్తూరి రాజుగారిపల్లె, సిద్ధకవాండ్ల పల్లె గ్రామాలలో విద్యుత్‌ స్తంభాలు, మల్బరీ షెడ్డు, వక్షాలు నేలకొరిగాయి. విద్యుత్‌ స్తంభం నేలకొరిగిన సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ఎలాంటి ఎటువంటి ప్రమాదం సంభ వించలేదు. విద్యుత్‌ స్తంభం కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
చెట్లు విరిగి పలువురికి తీవ్ర గాయాలు
మండలంలోని పలు ప్రాంతాల్లో రేకుల షెడ్లు కుప్పకూలిపోయాయి. సిద్ధక వాండ్లపల్లెకు చెందిన కష్ణారెడ్డి ,లక్ష్మీదేవి దంపతులు నివాసం ఉంటున్న ఇంటిపై పెద్ద చెట్టు పడడంతో వారికి గాయాలయ్యాయి. అలాగే తురకపల్లె చెందిన బీబీ ఇంటిపై చెట్టు ఉన్నట్టుండి పడడంతో ఆమె గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు వైద్యం కోసం లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు
నందలూరు : మండలంలో ఆదివారం సాయంత్రం వీచిన గాలులకు, కురిసిన వర్షానికి పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. నాగిరెడ్డి పల్లె మేజర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని కన్యక చెరువులో విద్యుత్‌ స్తంభం నీటిలో మునిగిపోవడంతో పాటు మరో నాలుగు ఒరిగిపోయాయి. విద్యుత్‌ శాఖ అధికారుల ఆదేశాల మేరకు విద్యుత్‌ లైన్‌ మెన్‌ శ్రీరామ్‌ కిరణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. నాగిరెడ్డిపల్లె గ్రామపంచాయతీ పరిధిలో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.