ప్రజాశక్తి-బి.కొత్తకోట (అన్నమయ్యజిల్లా) : తంబళ్లపల్లె మాజీ శాసనసభ్యులు కలిచర్ల ప్రభాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని జ్యోతి చౌక్‌లో ఆయన చిత్రపటానికి మాజీ ఉపసర్పంచ్ మాలిక్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జయభారత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, చిట్టా రామకృష్ణారెడ్డి జీవి రామకృష్ణ, మాజీ కో ఆప్షన్ అమీర్ భాష, భాస్కర్ రెడ్డి, గంజి మోహన, రాజారెడ్డి, శివన్న, మధు భూషణ్ రెడ్డి, చెన్నకేశవ స్వామి, సాదిక్ భాషా, మొహమ్మద్ గౌస్, కరీముల్లా, కృష్ణారెడ్డి, రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










