ప్రజాశక్తి-తెనాలి : 'పొలాలు ఎండిపోతున్నాయి.. నష్టపోతున్నాం.. తక్షణమే సాగునీరు విడుదల చేయాలని' కోరుతూ ఆదివారం గుంటూరు జిల్లా తెనాలి రూరల్ లో నందివెలుగు జంక్షన్లో రైతులు ఆందోళన చేపట్టారు. 10 ఎకరాలు సాగు చేస్తున్నానని పంట పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ మెడపై కొడవలి పెట్టుకొని ఓ రైతు నిరసన వ్యక్తం చేశారు. రైతుల నిరసనకు టిడిపి పోలిట్బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు, టిడిపి శ్రేణులు, జనసేన నాయకులు సంఘీభావంగా నిలిచారు. రైతుల ఆందోళన నేపథ్యంలో విజయవాడ తెనాలి, కొల్లిపర గుంటూరు మార్గాలలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. కృష్ణ పశ్చిమ డెల్టా ప్రాంతాలకుకు సాగునీరు విడుదల చేయాలని ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నందివేలుగు కూడలిలో రాస్తా రోకో నిర్వహించారు.










