Sep 20,2023 17:42

ప్రజాశక్తి-నందవరం  : కర్నూల్ జిల్లా నందవరం మండల పరిధిలోని కనకవీడు గ్రామానికి చెందిన దళిత రైతు అరెకంటి లింగన్న(54) అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గత ఆరెకంటి లింగన్న తన 1.50 ఎకరాల పొలంలో గత మూడు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు.  బ్యాంకు, బంధువులు దగ్గర దాదాపు పెట్టుబడికి రూ. 5,25,000 అప్పుగా చేసారని, పెట్టిన పెట్టుబడికి కూడా డబ్బులు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురై అప్పులు బాధ ఎక్కువ కావడంతో మంగళవారం రాత్రి 9:00 సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడాడు. నోటిలో నూరుగు రావడంతో కుటుంబ సభ్యులు గమనించి, ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా బుధవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిమ్మయ్య తెలిపారు.