కడప టిడిపి టికెట్‌పై సిగపట్లు తప్పడం లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి కడప అసెంబ్లీ ఇన్‌ఛార్జి ఎస్.వి.అమీర్ బాబు, సీనియర్ నాయకులు లకీëరెడ్డి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాసులరెడ్డి మధ్య పోటీ నెలకొంది. ముగ్గురు ఆశావహులు ఇటీవల టిడిపి అధిష్టానాన్ని వరుసగా కలుస్తుండడం ఆసక్తికరంగా మారింది. టిడిపి అధిష్టానం తరుపున చేపట్టిన ఇటీవలి సర్వేల్లో ముగ్గురు నాయకుల్లో అలంఖాన్‌పల్లికి చెందిన లకీëరెడ్డి ముందంజలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యం ఆసక్తికరంగా మారింది.
ప్రజాశక్తి - కడప ప్రతినిధి
కడప అసెంబ్లీ టికెట్ ప్రత్యేకతను సంతరించుకుంది. ఉమ్మడి కడప జిల్లాలోని పది అసెంబ్లీ టికెట్లలో కడప ప్రత్యేకతను కలిగి ఉంది. రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న పార్టీ తరుపున గెలుపొందిన అభ్యర్థికి కేబినెట్‌లో బెర్త్ దక్కడం ఆనవాయిగా వస్తోంది. 1983 అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల వరకు అధికారం దక్కించుకున్న పార్టీ తరుపున గెలుపొందిన సిఆర్‌సి దగ్గర నుంచి నేటి ఎస్‌బి.అంజాద్‌బాషా వరకు కెేబినెట్‌లో బెర్త్ దక్కిన సంగతి తెలిసిందే.
పోటా పోటీగా...
కడప అసెంబ్లీ టికెట్ దక్కించుకోవడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు పార్టీలకు అతీతంగా పోటీ పడుతుండడం పరిపాటిగా మారింది. ప్రతిపక్ష టిడిపి తరుపున 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి హవాలో ఓటమి పాలైన ఎస్.వి.అమీర్‌బాబు మరోసారి మైనార్టీ కార్డు తరుపున టికెట్‌పై కోటి ఆశలు పెంచుకున్నారు. సీనియర్ టిడిపి నాయకులు లకీëరెడ్డి కుటుంబం కడప టికెట్‌ను ఆశిస్తోంది. పార్టీ తరుపున చేపట్టిన బాదుడేబాదుడు, ఇదేంఖర్మ వంటి కార్యక్రమాల నిర్వహణ సందర్భంగా చంద్రబాబు, లోకేష్ పర్యటనల సందర్భంగా జనసమీకరణ దగ్గర నుంచి పార్టీ కార్యక్రమాల్లో తనదైన ముద్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. మూడో అభ్యర్థిగా టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాసులరెడ్డి తన సతీమణి పేరుతో కడప టిడిపి టికెట్ రేసులో నిలిచినట్లు ప్రచారం సాగుతోంది. వీరిలో లకీëరెడ్డి కుటుంబం బూత్‌ల వారీగా పార్టీ పటిష్టతకు సంబంధించిన వ్యవహారంపై దృష్టి సారించడం ఆసక్తికరంగా మారింది. టిడిపి అధిష్టానం కడప అసెంబ్లీ టికెట్ కేటాయింపు నిమిత్తం ఆరు రకాల సర్వేలతో కూడిన నివేదికల ఆధారంగా అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేయా లనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అధిష్టానం బాటలో...
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమీర్‌బాబు, లకీëరెడ్డి కుటుంబం, తాజాగా టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యు లు కుటుంబం తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. వీరిలో బుధ వారం ఒన్ టు ఒన్ పేరుతో నియోజకవర్గాల సమీక్ష నేపథ్యంలో అమీర్‌బాబు చంద్రబాబును కలిశారు. తాజాగా లకీëరెడ్డి కుటుంబం టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచెన్నాయుడు బృందాన్ని కలవడం ఆసక్తిక రంగా మారింది. నేడో, రేపో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్.శ్రీ నివాసులరెడ్డి కలిసే అవకాశం కనిపిస్తోంది.
అభ్యర్థిత్వం ఎవరికి?
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన అమీర్‌బాబు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించిన ఘనతను దక్కించుకుని రేసులో నిలిచారు. వైసిపి అభ్యర్థికి ధీటుగా బరిలో నిలిచి గెల వాలంటే ధీటైన అభ్యర్థిని నిలపాలనే ప్రచారాన్ని తెరపైకి వచ్చిన నేపథ్యంలో లకీëరెడ్డి కుటుంబం పేరు వినిపిస్తోంది. శ్రీనివాసులరెడ్డి తన సతీమణి పేరుతో కడప టికెట్ దక్కించుకునే రేసులో నిలవడడం ఆసక్తికరంగా మారింది. అధిష్టానం కడప టికెట్ కేటాయింపు అంశంపై ఆరు రకాల సర్వేలపై ఆధారపడి ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.










