Oct 30,2023 00:07

ఎల్‌నినో/లా నినాల ప్రభావంతోనే వాతావరణంలో మార్పులు

ఎల్‌నినో/లా నినాల ప్రభావంతోనే వాతావరణంలో మార్పులు


ఎస్వియూ భౌతిక శాస్త్ర ఆచార్యులు ఎస్‌.విజయభాస్కరరావు
కొన్ని ప్రాంతాల్లో అతివష్టి, మరికొన్ని ప్రాంతాల్లో అనావష్టి ఏర్పడే అవకాశం
ప్రజాశక్తి - క్యాంపస్‌:
తూర్పు పసిఫిక్‌ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలలో మార్పుల ఏర్పడే ఎల్‌ నినో/ లా నినా ప్రక్రియల మూలంగా ప్రపంచ వాతావరణంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయని, దీని కారణంగా ఆంధ్రప్రదేశ్‌ సహా భారత ఉపఖండంలో వాతావరణం కూడా వాతావరణం మార్పులకు ఎంతో అవకాశం ఉందని ప్రముఖ భౌతిక శాస్త్ర ఆచార్యులు ఎస్‌.విజయ భాస్కరరావు పేర్కొన్నారు. వాతావరణం మార్పులు - కారణాలు అనే అంశంపై 'ప్రజాశక్తి 'తో ఆయన మాట్లాడుతూ ఎల్‌ నినో/లా నినా సదరన్‌ ఆసిలేషన్‌ (ఎంసో) ప్రక్రియ, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తుందన్నారు. సహజసిద్ధంగా జరిగే ఈ ప్రక్రియలో పసిఫిక్‌ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రత (ఎస్‌ఎస్‌టి)లలో మార్పులు జరగడం ద్వారా ఏర్పడే వాతావరణ పీడనం, ప్రసరణ మార్పులు, ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని వివరించారు. ఎంసో ప్రక్రియని అర్థం చేసుకోవడంలో, అంచనా వేయడంలో ఇటీవల కాలం శాస్త్రవేత్తలు పురోగతి సాధించారని తెలిపారు. ఎంసో ప్రక్రియ అర్థం చేసుకోవటం ద్వారా భారీ వర్షాలు, వరదలు మరియు కరువు, కాటకాలు వంటి సంఘటనలను ఒకటి నుంచి తొమ్మిది నెలలు ముందుగానే గ్రహించి, వాటి పరిణామాల గురించి ముందుగానే హెచ్చరించే అవకాశం ఉందని వివరించారు. 2020 నుంచి 2023 వరకు సంభవించిన 'ట్రిపుల్‌- డిప్‌ లా నినా' సంఘటనలను పరిగణలోకి తీసుకొని ఈ లా నినా పసిఫిక్‌ మహాసముద్రంలో నిరంతరం బలమైన గాలులను కలిగి ఉండడాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, గాలి క్రమరాహిత్యాల నిర్ధిష్ట నమూనాల కారణంగా ఇటువంటి పరిణామాలు జరిగినట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారని వెల్లడించారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, గాలుల తీవ్రత ఆధారంగా ఈ అసాధారణ నమూనాలను ట్రిపుల్‌- డిప్‌ లా నినా ప్రక్రియకు అనుకూలమైన వాతావరణాన్ని సష్టించాయని వివరించారు. 'నినో 3.4 ఇండెక్స్‌' పరిజ్ఞానంతో పసిఫిక్‌ మహాసముద్రంలోని నిర్ధిష్ట భాగంలో ఉష్ణోగ్రతను కొలవడం సులభంగా మారిందని అన్నారు. ట్రిపుల్‌ డిప్‌ లా నినా ప్రక్రియ సమయంలో ఇది సాధారణం కంటే స్థిరంగా చల్లగా ఉంది. ఇది ఈ లా నినా సుదీర్ఘ స్వభావాన్ని సూచిస్తుందని తెలిపారు. మల్టీ ఇయర్‌ లా నినా, ఈ ట్రిపుల్‌- డిప్‌ ఈవెంట్‌ లాగా, తక్కువ, ఒకే సంవత్సరం లా నినా ప్రక్రియ తో పోలిస్తే ప్రపంచ వాతావరణ ప్రసరణపై మరింత ముఖ్యమైన శాశ్వతమైన ప్రభావాలను విశ్లేషించేందుకు ఈ పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో అసాధారణ వాతావరణ పరిస్థితులకు ఏర్పడడంతో కొన్ని ప్రాంతాల్లో వర్షప్రభవ పరిస్థితులు, మరికొన్నింటిలో వర్షాచ్చాయ పరిస్థితులు ఉన్నాయని విశ్లేషించారు. 2022లో ఈ సుదీర్ఘ లానినా వాతావరణ నమూనాలను ప్రభావితం చేయడం వలన దక్షిణ చైనాలో కరువు, పాకిస్తాన్లో భారీ వర్షాలు కురవడం వంటి పరస్పర విరుద్ధ వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ఇటువంటి వాతావరణ నమూనాలను, ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను క్షుణంగా అధ్యయనం చేయడానికి లానినా ప్రభావం శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతుందని అన్నారు. సెప్టెంబర్‌ 2023లో భూమధ్య రేఖ పసిఫిక్‌లోని సముద్రం సాధారణం కంటే వెచ్చగా ఉంది, ముఖ్యంగా నినో 3.4 ప్రాంతంలో అక్టోబర్‌లో మొదటి 16 రోజులు, సెంట్రల్‌ ఈక్వటోరియల్‌ పసిఫిక్‌ ఉపరితల ఉష్ణోగ్రత మరింత వేడెక్కి ధని, అయితే పశ్చిమ,తూర్పు భాగాలు చల్లబడ్డాయని వివరించారు. సెప్టెంబర్‌లో అరేబియా సముద్రం, పశ్చిమ భూమధ్య రేఖ హిందూ మహాసముద్రంలో వెచ్చని ఉపరితల ఉష్ణోగ్రతలు వునాకానీ, ఉత్తర బంగాళాఖాతం, దక్షిణ భూమధ్యరేఖ హిందూ మహాసముద్రంలో చల్లటి ఉష్ణోగ్రతలు వునాయని అన్నారు. అక్టోబర్‌లో ఉత్తర అరేబియా సముద్రం వేడెక్కింది, అయితే ఉత్తర బంగాళాఖాతం, భూమధ్య రేఖ భారతదేశంలో చాలా వరకు వేడెక్కిందని, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత చల్లబడిందన్నారు. మధ్య మరియు తూర్పు భూమధ్యరేఖ పసిఫిక్‌ మహాసముద్రంలో వచ్చే మూడునెలల పాటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ అంచనా వ్యవస్థ సూచిస్తుందని వెల్లడించారు. ఇది ఎల్‌ నినో పరిస్థితులు 2024 ప్రారంభంలో కొనసాగడానికి దారి తీయవచ్చన్నారు. సానుకూల హిందూ మహాసముద్ర ద్విధ్రువ (10డి) ఉపరితల ఉష్ణోగ్రత పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇది వెచ్చని ఎల్‌ నినో సానుకూల ఐఒడి పరిస్థితుల కారణంగా భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఎక్కువ వర్షాలు కురుస్తుందని, మరి కొన్ని ప్రాంతాలలో కరువు కాటకాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. దీని వలన బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో మరిన్ని తుపానులు వచ్చే అవకాశం ఉందన్నారు. సెప్టెంబరు నుంచి నవంబర్‌ 2023 వరకు తీవ్ర వాయువ్య, ఈశాన్య, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో సగటు కంటే ఎక్కువ వర్షం కురిసే సంభావ్యత ఎక్కువగా ఉంటుందని వివరించారు. కానీ ఉత్తరం, పశ్చిమం, మధ్య తూర్పు, ఉత్తర ద్వీపకల్ప ప్రాంతాలలో సగటు కంటే తక్కువ వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. అక్టోబరు నుంచి డిసెంబర్‌ 2023 వరకు ఉత్తర ద్వీపకల్ప ప్రాంతాలు, మధ్య దక్షిణ ఆసియాలోని కొన్ని ప్రాంతాలు మినహా, దక్షిణాసియాలో చాలా వరకు వర్షాలు కురుస్తాయని, దేశంలో తక్కువ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు తగ్గిన సహాయక చర్యలు చేపట్టేందుకు వాతావరణశాఖ సూచనలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ గమనిస్తూ వారి యొక్క సూచనలు సలహాలు పాటించాలని సూచించారు. వాతావరణంలో మార్పులు ఒక్కరోజులో మొదలైన ప్రక్రియ కాదని ఎల్‌ నినో / లా నినా ప్రభావాల వలన ప్రపంచవ్యాప్తంగా కూడా అతివష్టి లేదా అనావష్టి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందన్నారు. సముద్ర అంతర్భాగంలో ఏర్పడి ఈ చర్యలకు కొన్ని వాతావరణ కాలుష్య పరిస్థితులు కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. సముద్రతీర ప్రాంతాలలోని ఆయా ప్రభుత్వాలు దానికి అనుగుణంగా వాతావరణ సూచనలను పరిగణలోకి తీసుకొని తక్షణం స్పందించి తగు నివారణ చర్యలను తీసుకోవాలని సూచించారు.