Oct 26,2023 21:22

ఐఎస్‌ఒ గుర్తింపుతో ఎస్వీయూ ఉన్నతాధికారుల్లో ఆనందం

ఎస్వీయూకు ఐఎస్‌ఒ గుర్తింపు: విసి
ప్రజాశక్తి - క్యాంపస్‌
రాష్ట్రంలో 69 సంవత్సరాలుగా అత్యున్నత ప్రమాణాలతో విద్యనందిస్తున్న శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఐయస్‌ఓ గుర్తింపు లభించడం పట్ల ఉపకులపతి ఆచార్య కె.రాజారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అక్టోబర్‌ 25, 26 తేదీల్లో హైదరాబాద్‌ కు చెందిన హెచ్‌ ఓయమ్‌ ఇంటర్న్షనల్‌ సంస్థ రెండు రోజుల పాటు ఎస్వీయూను సంపూర్ణంగా పరిశీలన చేసిందని, బందం సభ్యులు టీమ్‌ లుగా వివిధ శాఖలను , పరిపాలనా భవనాన్ని విద్యాప్రమాణాలను, అవస్థాపన సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారని విసి తెలిపారు. గురువారం సాయంత్రం ఐయస్‌ఓ ప్రతినిధి శివయ్య విసి ఆచార్య కె. రాజారెడ్డిని కలసి ఐయస్‌ఓ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ ఎస్వీయూ గత సంవత్సరం ఐయస్‌ఓ నంబర్‌ ను పొందడం జరిగిందని, ఈ సంవత్సరం కూడా మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఐయస్‌ఓ బందం నిర్ధారణ చేసి సర్టిఫికేట్‌ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. రిజిస్ట్రార్‌ ఆచార్య మహమ్మద్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ విసి ఆచార్య రాజారెడ్డి మార్గదర్శకత్వంలో హెచ్‌ఓయమ్‌ -ఇంటర్నేషనల్‌ సంస్థ ఎస్వీయూను రెండు రోజులు సందర్శించి, వివిధవిభాగాలను తమ ఆడిట్‌ తో అంచనా వేసి ఎన్విరాన్మెంట్‌ -గ్రీన్‌ లో ఐయస్‌ఓ14001 సర్టిఫికేషన్‌, ఎడ్యుకేషన్‌ క్వాలిటీ మేనేజ్మెంట్‌ లో ఐయస్‌ఓ :210001 సర్టిఫికేషన్‌ ,ఎనర్జీ సేవింగ్‌ లో ఐయస్‌ఓ 50001: గుర్తింపును, ధ్రువీకరణ పత్రాలను అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిసి డీన్‌ అప్పారావు, నరసింహ పాల్గొన్నారు.
ఐఎస్‌ఒ గుర్తింపుతో ఎస్వీయూ ఉన్నతాధికారుల్లో ఆనందం