Jan 28,2023 20:05

మాట్లాడుతున్నడాక్టర్‌ ఎస్‌పి భారతి


మాట్లాడుతున్నడాక్టర్‌ ఎస్‌పి భారతి
ఎస్‌విఆర్‌ హైస్కూల్‌లో లాలా లజపతిరారు జయంతి
నెల్లూరు:స్థానిక జాకీర్‌ హుస్సేన్‌ నగర్‌ ప్రాంతంలోని ఎస్‌విఆర్‌ హైస్కూల్‌ ఆవరనంలో లాలా లజపతిరారు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం పినాకిని యూత్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్యఅతిధిగా కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమి సభ్యురాలు, కళారత్న, డాక్టర్‌ ఎస్‌పి భారతి హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత స్వాతంద్రోద్యమానికి ఉత్తేజాన్నిచ్చిన లాలా లజపతిరారు సేవలు ఎనలేనివన్నారు.
లాలా లజపతిరారు జయంతి సందర్బంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. విద్య ప్రాముఖ్యం తెలిసిన లాలా దయానంద ఆంగ్లో వైదిక కళాశాలతో సహా ఎన్నో విద్యాసంస్థల ఏర్పాటుకు కషి చేశారని వివరించారు. స్కూల్‌ కరెస్పాండంట్‌ అందే శ్రీనివాసులు మాట్లాడుతూ సైమన్‌ కమీషర్‌ 1928 అక్టోబర్‌ 30న లాహౌర్‌ రాగా, నిరసన ప్రదర్శనలకు లాలా లజపతిరారు నాయకత్వం వహించారని తెలిపారు. ఈకార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షులు కె.మురళీమోహన్‌ రాజు, స్కూల్‌ ప్రిన్సిపాల్‌ బి.రమేష్‌ బాబు, లెక్చరర్‌ సుదర్శన్‌ రావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.