Dec 20,2022 19:53

నిరసన తెలుపుతున్న ఎంఆర్‌పిఎస్‌ నాయకులు

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్‌పిఎస్‌ ఉమ్మడి జిల్లాల కన్వీనర్‌ వెలగచర్ల శివయ్య డిమాండ్‌ చేశారు. వర్గీకరణ కోరుతూ ఎంఆర్‌పిఎస్‌, ఎంఎస్‌పి ఆధ్వర్యంలో అంబేద్కర్‌ భవన్‌ వద్ద చేపడుతున్న నిరసన దీక్షలు మంగళవారానికి రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21, 22వ తేదీలలో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిర్వహించే నిరసన దీక్షలను జయప్రదం చేయాలన్నారు. 23వ తేదీన కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. ఆ కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు మంద శివయ్య, వెంకటేష్‌, మని, సిద్ధారపు పెంచలయ్య, ఎర్రబల్లి నారాయణ, రేవూరి అఖిల్‌, కంటి ప్రేమ్‌ బాబు, జడ శివ, దండు సాయి, తేజ, మోహన్‌, వంగ పూరి వంశీ పాల్గొన్నారు.