ఎస్‌పి వల్ల దళితుల మనోభావాలు దెబ్బతింటున్నారు..!
-టిడిపి రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య
నెల్లూరు:ఎస్‌పి మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రకటించే ముందు అదే ఎస్‌పి వ్యవహారశైలి వల్ల దెబ్బతిన్న దళితుల మనోభావాలకు సమాధానం చెప్పాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య డిమాండ్ చేశారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధికార ప్రతినిధి సాబీర్ ఖాన్, రాష్ట్ర ఎస్‌సి సెల్ అధికార ప్రతినిధి మాతంగి కష్ణ, నెల్లూరు పార్లమెంట్ టిడిపి మైనార్టీ ఉపాధ్యక్షుడు అల్లాబక్షు లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెన్నీ రమణయ్య మాట్లాడుతూ టిడిపి నేతలపై జరిగిన దాడుల పై, హత్యా ప్రయత్నాల పై, అలాగే ఎస్సీ, మైనారిటీ కార్పొరేషన్ ల వద్ద నుండి వచ్చిన నోటీసులకు కూడా, ఎస్‌పి స్పందించకపోవడంతో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశంలో తన ఆవేదనను వ్యక్తపరచారని అన్నారు. ఎస్‌పిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లాలో దళితుల పై ఐదు ప్రధానఘటనలు జరిగాయన్నారు. ఈ ఘటనల విషయంలో ఎస్‌పి తీరు, మాతంగి కష్ణ అల్లా బక్షుల విషయంలో 100 రోజులు గడుస్తున్న ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం పై స్పందిస్తూ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. ఆవేదనతో అన్న మాటలను పరిగణంలోకి తీసుకొని, పోలీసు వ్యవస్థ, ఎస్‌పి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి మా దళిత నాయకుల్ని పిలిపించి ఎల్లప్పుడూ దళితుల పక్షాన నిలబడి పోరాడే అబ్దుల్ అజీజ్ దిష్టిబొమ్మను దహనం చేయించారన్నారు. ఈ ఘటన వెనుక పరోక్షంగా ప్రత్యక్షంగా ఎస్‌పి హస్తం ఉందన్నారు. పోలీసు అసోసియేషన్ లో ఉన్న అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దగ్గర నుంచి నిన్న మీడియా సమావేశం పెట్టిన పోలీసుల వరకు ఈ ఐదు ఘటనలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.తాము కూడా దళితుల మేనని.. దళితులను చంపేశారని.. చంపబోయారని.. చావడానికి సిద్ధంగా ఉన్నారని.. వీటికి పోలీసులు సమాధానం చెప్పాలన్నారు. పోలీసులు సమాదానం చెప్పిన రోజు తమ మనోభావాలు దెబ్బతిన్న విషయంపై అబ్దుల్ అజీజ్ చర్చిస్తామని అన్నారు.వందరోజుల లోపు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు తెలియదా.. మీరు చర్యలు తీసుకోకపోతే తప్పులేదు కానీ మేము ప్రశ్నించడం తప్పైపోయిందా అని అన్నారు. పక్క జిల్లాల నుంచి దళితుల్ని పిలిపించి దళితుల మనోభావాలకు అనుగుణంగా మాట్లాడిన అబ్దుల్ అజీజ్ దిష్టిబొమ్మను దహనం చేయించారని మాకు కూడా దిష్టిబొమ్మలు దహనం చేయడం తెలుసని మాకు కూడా సంఘాలు ఉన్నాయన్నారు. పోలీసుల విలేఖరుల సమావేశాన్ని మేము కూడా చూసామని వివాదాస్పదంగా మేము పోదలుచుకోలేదని, మనోభావాలు కూడా దెబ్బతిన్నాయని దానికి ఎస్‌పి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్‌పి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేముందు జరిగిన సంఘటనలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం సాబీర్ ఖాన్ మాతంగి కష్ణ అల్లా బక్షులు మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో కనపర్తి గంగాధర్, గోడ పద్మ, ఇజ్రాయిల్, పెంచలయ్య, మిర్చి రవి, వెంకట శేషు, వెంకట లక్ష్మీ, అరవ కిషోర్, మారుతి, నాగరాజు పాల్గొన్నారు.










