ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఇసి) నీలం సహాని నియామక కేసు విచారణ ఈ నెల 23కు వాయిదా పడింది. ఎస్‌ఇసి నియామకం చట్టబద్ధంగానే జరిగిందని గవర్నరు ముఖ్య కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది సివి మోహన్‌రెడ్డి వాదిం చారు. ఆమె నియామకాన్ని సవాల్‌చేసిన పిటిషనర్‌కు వ్యక్తిగత హక్కులకు ఏ విధం గానూ భంగం కలగలేదు కాబట్టి పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. ప్రజాహితంతో ముడిపడినప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలతో పనిలేదని పిటిషనర్ న్యాయవాది శశిభూష ణ్‌రావు ప్రతివాదన చేశారు. ఇందుకు చెందిన తీర్పుల ప్రతిని అందజేస్తామని చెప్పారు.










