Mar 09,2023 20:34

- విఆర్‌ఒ రహమత్‌ఖాన్‌

 రాయచోటి టౌన్‌ : రూ.ఐదు వేలు లంచం తీసుకుంటూ మాధవంర విఆర్‌ఒ పఠాన్‌ రహమత్‌ఖాన్‌ కడప ఎసిబి అధికారులకు గురు వారం చిక్కారు. కాటినేనివారిపల్లెకు చెందిన కె.నీలావతి తన పొలంలో ఉన్న సర్వే నెంబర్‌ 575లోని వ్యవసాయ భూమిని మ్యుటేషన్‌ ఆన్‌లైన్‌, పట్టాదారు పాసుపుస్తకం కోసం రూ.ఐదు వేలు ఇవ్వాలని విఆర్‌ఒ డిమాండ్‌ చేశారు. ఇవ్వకపోతే పని జరుగదని తేల్చి చెప్పాడు. బాధితురాలు చేసేది లేక ఎసిబి అధికారులను సంప్రదించింది. ఎసిబి అధికారుల సూచనల మేరకు సచివాలయంలో రహమత్‌ ఖాన్‌ నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా కడప ఎసిబి డిఎస్‌పి కంజాక్షన్‌ తన సిబ్బందితో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ అధికారులు సిబ్బంది ప్రజలను పనుల నిమిత్తం డబ్బులు డిమాండ్‌ చేసినట్లయితే వెంటనే 14400 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎసిబి సిఐ ఏలమరాజు, కృష్ణమోహన్‌, నరేష్‌, ఎస్‌ఐ నౌషాద్‌ అలీ భాష సిబ్బంది పాల్గొన్నారు.