Dec 19,2022 18:47

ఎస్‌ఎస్‌సి మోడల్‌ పేపర్స్‌ను ఆవిష్కరిస్తున్న డివైఇఒ

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌: సీనియర్‌ ఉపాధ్యాయులచే తయారు చేయించిన పదవ తరగతి మోడల్‌ పేపర్ల పుస్తకాన్ని సోమవారం మదనపల్లి డివైఇఒ కృష్ణప్ప ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుటిఎఫ్‌ వారిచే నూతన పరీక్ష విధానానికి అనుగుణంగా తయారు చేసిన మోడల్‌ పేపర్లు అందరి పిల్లలకు ఉపయోగపడేలా తయారు చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు సుధాకర్‌ నాయుడు, డివిజన్‌ కన్వీనర్‌ సుధాకర్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ పురం వెంకటరమణ, పయాని హరికృష్ణ, సీనప్ప, అంజాద్‌బాషా పాల్గొన్నారు.