ఫొటో : పొలంబడి కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ అధికారులు
ఎరువులు అధిక మోతాదులో వాడరాదు
ప్రజాశక్తి-అల్లూరు : ఎరువులు, పురుగు మందులు పంటకు అధిక మోతాదులో వాడరాదని మండల వ్యవసాయ అధికారి వేణుగోపాలరావు తెలియజేశారు. శనివారం శ్రీనివాసులు నాయుడు పొలం వద్ద పొలంబడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. అంతేకాకుండా వ్యవసాయ రైతులకు పలు విషయాలను తెలియబరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్గి తెగులుపై జాగ్రత్త వహించాలని కోరారు. రైతు సోదరులు అవగాహనతో వ్యవసాయం చేయాలని కోరారు. ఎల్లవేళలా మీకు అందుబాటులో వ్యవసాయ అధికారులు ఉన్నారని ఏ సమస్య వచ్చినా వెంటనే సంప్రదించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో పలువురు విఎఒలు తదితరులు పాల్గొన్నారు.










