యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు
ప్రజాశక్తి రొద్దం : ఎరువుల కొరత నెలకొనడంతో మండల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు ప్రభుత్వం ద్వారా అందించే యూరియా నాలుగు రోజులుగా నిల్వ లేకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. రెండు రోజులు క్రితం యూరియా స్టాకు ఉన్నప్పటికీ తక్కువగా ఉందన్న కారణంతో పంపిణీ చేయలేదు. తిరిగి మూడు లోడులు వచ్చిన తరువాత పంపిణీ చేపడతామని అధికారులు చెప్పారు. అయితే అది కూడా రాకపోవడంతో ఉన్న స్టాకును రైతులకు ఇవ్వటానికి మంగళవారం ఏర్పాటు చేశారు. అయితే ఒక్కొక్క రైతుకి ఆధార్ కార్డుకు 2పాకెట్లు చొప్పున ఇచ్చారు. మండలం మొత్తం కలిసి 270 పాకెట్ల యూరియా 130మందికి అందించినట్లు సొసైటీ సిబ్బంది తెలిపారు. యూరియా అందని రైతులు నిరాశ చెందారు.










