Jan 04,2023 21:54

ఫొటో : ఆర్‌బికె ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు

ఎరువుల కోసం రైతుల ఆందోళన
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : మండలంలోని మహిమలూరు గ్రామంలోని సిండికేట్‌ ఫార్మర్‌ సొసైటీ భవనం వద్ద తమకు సరిపడా ఎరువులు ఇవ్వాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. ఎకరాకు ఆరు బస్తాలు అవసరమైతే అరబస్త కూడా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన రైతులు.. మూడు రోజులు నాలుగు రోజులు సోసిటీ భవనం వద్ద పడి గాపులు పడితే ఒకటి లేదా రెండు బస్తాలు మాత్రమే వస్తున్నాయని రైతులు ఆవేదన వెళ్లబుచ్చారు. ఓ దశలో సిబ్బందితో తీవ్ర వాగ్వాదం పెట్టుకున్న తర్వాత కొందరికి ఒకటి రెండు బస్తాలు ఇచ్చి మళ్లీ లేవని ఆపివేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. తమకు స్టాకు వచ్చిన విధంగానే రైతులకు యూరియా ఇస్తున్నామని సిబ్బంది తెలిపారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ ప్రాంతం పూర్తిగా వ్యవసాయ ప్రాంతమని ప్రస్తుతం వరి పైరు సాగులో ఉన్నందున ప్రతి ఒక్కరికీ ఎరువులు అవసరమని ఒక ఎకరాకి సుమారు ఆరు బస్తాలు అవసరం ఉండగా ఇక్కడ సరిపోయినంత ఎరువులు ఇవ్వడం లేదని పైఅధికారులు కలుగజేసుకొని సరిపడా ఎరువులు అందించాలని కోరారు. సొసైటీ పరిధిలో సుమారు 3 వేలఎకరాల వరి సాగులో ఉన్నట్టు రైతులు తెలిపారు.