స్టాకును పరిశీలిస్తున్న ఎఒ నివేదిత
ప్రజాశక్తి రొద్దం : ఎరువుల దుకాణాలను అధికారులు బుధవారం తనిఖీ చేశారు. ప్రజాశక్తి దినపత్రికలో ఎరువుల కోసం రైతుల అవస్థలు అనే శీర్షికన బుధవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వెంటనే 113బస్తాల యూరియాను సమకూర్చారు. ఎరువుల కోసం రైతుల అవస్థలు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎరువులు ప్రైవేట్ దుకాణాలలో అందుబాటులో ఉన్నాయనికావలసిన రైతులు తీసుకువెళ్లొచ్చని సూచించారు. అదేవిధంగా మండలంలోని పలు ఎరువుల దుకాణాలను ఎఒ నివేదిత బుధవారం తనిఖీ చేశారు. ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి అంజాద్ తదితరులు పాల్గొన్నారు.










