Jan 12,2023 21:42

తనిఖీ చేస్తున్న సబ్‌కలెక్టర్‌

పెనుకొండ : నగర పంచాయతీ పరిధిలోని మంగాపురం,వెంకటరెడ్డి పల్లి గ్రామాలలోని చౌకధరల దుకానాలను పెనుకొండ సబ్‌కలెక్టర్‌ కార్తీక్‌ గురువారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా స్టాకు వివరాలు, సరుకుల పంపిణీ విధానం తదితర వాటిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ పౌర సరఫరాల ఉప తహశీల్దార్‌ ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు.