ప్రజాశక్తి-పెడన : కృష్ణా జిల్లా పెడన నియోజవర్గం గూడూరు మండలం కప్పల దొడ్డి బాల భాస్కర వీవర్స్ కోపరేటివ్ సొసైటీ లో చేనేతల సమావేశం నిర్వహించి అనంతరం వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ చేనేత నాయకులు
అందె జగదీశ్, పిల్లలమర్రి నాగేశ్వర్రావు, ఆకురాతి రత్నారావు, పేరిశెట్టి ఉమాకాంత్, ఊటుకూరి చిన్మయ లింగం, మేడక మోక్షానంద రావు, ఎక్కల నాగేశ్వర్రావు, కోదాటి నాగయ్య, శ్యామల సుబ్రహ్మణ్యం, రాపోలు జగన్ మరియు యితర చేనేత కార్మికులు పాల్గొన్నారు.
సీనియర్ చేనేత నాయకులు కట్టా హేమ సుందర్ మార్గదర్శకాలతో ఏప్రిల్ 23న చేనేత మహా ధర్నా కృష్ణా జిల్లా ప్రచార యాత్ర సాగుతోంది తెలిపారు.










