ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరోసారి ముంచడానిజే బిఅర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తూ కెసిఆర్ వస్తున్నాడని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహనికి వినతి పత్రం ఇస్తూ బిసి హక్కుల పోరాట సమతి జిల్లా అధ్యక్షులు బోడెం రాజశేఖర్ విమర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైన మాట్లాడిన మాటలు గాని, రాష్టాన్ని ముంచిన విధానన్ని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు అప్పుడే మరచి పోయాయా అని ప్రశ్నించారు. రాజకీయ పబ్బం కోసమే కెసిఆర్ సమైక్య రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశాడని విమర్శించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలు, యువత, రైతులు, కార్మికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బిసిహెచ్‌పిఎస్ నాయకులు హరి, వేణు, ఎం.వెంకటేశ్వర యాదవ్, రామలింగయ్య, బండి రామచంద్ర, నాగినేని గోవిందు, మక్కినేని వేణుగోపాల్, ఉదయా రెడ్డి, శంకర్ రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.










