అమరావతి : ఎపిలో గడచిన 24 గంటల్లో 83,885 మంది నమూనాలు పరీక్షించగా.. 3,166 కొత్త కేసులు నమోదయ్యాయి. 21 మంది మృతిచెందారు. కరోనా నుంచి నిన్న ఒక్క రోజే 4,019 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 32,356 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. కరోనా వల్ల చిత్తూరు జిల్లాలో నలుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపురం జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు మృతిచెందారు.










