మాట్లాడుతున్న నాయకులు
ఎపిజిఇఎఫ్ ఆధ్వర్యంలో సంబరాలు
ప్రజాశక్తి-నెల్లూరు:రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసేందుకు అవసరమైన బిల్లుకు ఆమోదం తెలియజేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు ఉద్యోగులు సంభరాలు జరుపుకున్నారు. బుధవారం స్థానిక సంతపేట ప్రాంతంలోని ఓ ప్రయివేట్ భవన్‌లో ఎపిజిఈఎఫ్ జిల్లా శాఖ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రెగ్యులరైజేషన్ కోసం 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల కలల సాకారం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వారి కుటుంబాల్లో సంతోషాన్ని , ఆనందాన్ని వైసిపి ప్రభుత్వం నింపిందన్నారు. రెగ్యులరైజేషన్ బిల్లుకు ఆమోదం లభించడంతో కాంట్రాక్టు ఉద్యోగులకు ఏపిజిఈఎఫ్ సంఘా నాయకులు కేక్ కట్ చేసి తినిపించి సంబరాలు నిర్వహించారు. ఎపిజిఈఎఫ్ గౌరవ అధ్యక్షులు, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలో కీలక భూమిక పోషించారన్నారు.కాంట్రాక్టు ఉద్యోగుల కల సాకారం చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ జిఎఫ్ జిల్లా చైర్మన్ చేజర్ల సుధాకర్ రావు జిల్లా జనరల్ సెక్రెటరీ దేవి రెడ్డి రమణారెడ్డి కతజ్ఞతలు తెలియజేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి రెగ్యులరైజేషన్ కోసం పూర్తిస్థాయిలో కషి చేసిన ఏపీ జిఇఎఫ్ రాష్ట్ర చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ అరవ పాల్‌లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిడబ్ల్యూఎస్‌ఈఎ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లి హరీష్ రెడ్డి, ఎపిజిఈఎఫ్ జిల్లా ట్రెజరర్ బాలరాజన్, వైస్ ప్రెసిడెంట్ కర్లగుంట మల్లికార్జున, షేక్ ఖాలీద్, సుహాంత్ రెడ్డి నాయకులు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగ సంఘం నాయకులు వెంకటేశ్వరరావు సంజీవ్ కుమార్, ట్రెజరీ అసోసియేషన్ నాయకులు రెహమాన్ అన్ని శాఖల కాంట్రాక్టు ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.










