May 22,2023 21:50

ఫొటో : దీక్ష చేపడుతున్న ఎపిజిఇఎ నాయకులు

ఎపిజిఇఎ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : మండలంలోని మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగస్తుల సంగం ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు వై.రమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్‌ను రద్దు పరిచి ఒపిఎస్‌ను పునరుద్ధరించాలన్నారు. ప్రతినెలా 1వ తేదీన జీతభత్యాలు చెల్లించేలా చట్టం చేయాలన్నారు.
అన్ని శాఖలలో డిఎస్‌సి ద్యారా నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలర్‌ చేయాలన్నారు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మెరుగైన జీతాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లికార్జున, కోశాధికారి రాంప్రసాద్‌, మహిళ కన్వీనర్‌ విజయనిర్మల, సుజాత బారు, నారాయణరెడ్డి, జి.రామ్‌ బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రబుత్య ఉద్యోగులు తదితరులున్నారు.