అమరావతి : రాష్ట్రంలో 13 మంది ఐపిఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా మాలికాగర్గ్, విజయవాడ రైల్వే ఎస్పీగా రాహుల్ దేవ్ సింగ్, మంగళగిరి బెటాలియన్ కమాండెంట్ అజిత్ వేజెంట్ల, కాకినాడ బెటాలియన్ కమాండెంట్‌గా జిఎస్.సునీల్, విశాఖ డిసిపి వన్‌గా గౌతమి సలి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా జిందాల్, రాజమండ్రి అర్బన్ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా షిముని, పగో జిల్లా ఎస్పీగా రాహుల్ దేవ్ శర్మ, ఆక్టోపస్ ఎస్పీగా కోయ ప్రవీణ్, ఎపి ఎస్పీ విజయనగరం బెటాలియన్ కామెందెంట్‌గా విక్రంత్ పాటిల్, డిజిపి ఆఫీస్‌లో ఆర్‌ఎంగా అమ్మిరెడ్డి, డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని నారాయణ నాయక్‌కు ఆదేశాలు అందాయి.










