ఎపి జెన్కో ఆందోళనకు మద్దతు ఇవ్వాలి
ప్రజాశక్తి-కావలి : ఎపి జెన్కో శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా 345 రోజులుగా జరుగుతున్న ఆందోళనకు మద్దతు ప్రకటించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి శుక్రవారం కావలిలో పరిరక్షణ కమిటీ, జెఎసి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం.మోహన్ రావు, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, బీద రవిచంద్ర, బొమ్మి సురేంద్ర, సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, ఎఐఎఫ్‌టియు న్యూ జిల్లా నాయకులు పి.యానాదయ్య, లక్ష్మీరెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి గోగుల శ్రీనివాసులు, టిఎన్‌టియుసి జిల్లా నాయకులు కళ్యాణ్, ప్రసాద్, సిపిఎం నాయకులు పి.పెంచలయ్య, టి.మాల్యాద్రి ఎపిజెన్కో జెఎసి నాయకులు సిహెచ్. ఆదిశేషయ్య, ఎ.అనిల్. కె.రవి, భాస్కర్, పి.మోహన్ రావు, శ్యామ్, సునీల్, ఈశ్వరయ్య, నక్క మోహన్‌రావు తదితరులు ఈ ప్రతినిధి వర్గంలో ఉన్నారు. ఎపిజెన్కో ఆందోళనకు చంద్రబాబు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు.










