Jan 03,2023 21:25

ఫొటో : క్యాలెండరును ఆవిష్కరిస్తున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి

ఎపి ఎన్‌జిఒ క్యాలెండర్‌ ఆవిష్కరణ
ప్రజాశక్తి-కావలి : ఎపి ఎన్‌జిఒ అసోసియేషన్‌ కావలి తాలూకా ప్రెసిడెంట్‌ ఎస్‌.శివకుమార్‌ ఆధ్వర్యంలో మంగళవారం నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్‌జిఒ సభ్యులందరికీ ఎంఎల్‌ఎ నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
కావలి నియోజకవర్గంలో ఉద్యోగులందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తమవంతు సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లి, ఉద్యోగులకు న్యాయం జరిగేలా చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఎన్‌జిఒస్‌ గౌరవ అధ్యక్షులు డి.సుధీర్‌ నాయుడు, పట్టణ అధ్యక్షులు కె.శివకుమార్‌, ఎఎంసి చైర్మన్‌ సన్నిబోయిన ప్రసాద్‌ యాదవ్‌, మాజీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ కనుమర్లపూడి వెంకట నారాయణ, కేతిరెడ్డి జగదీష్‌ రెడ్డి, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ నర్సారెడ్డి, సెక్రటరీ నాగరాజు, వైస్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌, ఉమా శంకర్‌, ట్రెజరర్‌ వీరయ్య, మహిళా కార్యదర్శులు మమత, ప్రమీల, ప్రశాంతి, రాణి, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అరుణ్‌, చైతన్య, నీలిమ, శ్రీవిద్య, ఉద్యోగులు పాల్గొన్నారు.