Apr 04,2022 08:06

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి కొత్త జిల్లాలు ఉనికిలోని వచ్చాయి. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి విడుదల చేసిన తుది గెజిట్‌ నోటిపికేషన్‌ ఆధారంగా నూతన జిల్లా కేంద్రాల్లో అధికారయంత్రాంగం నేటి నుండి విధులు నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో గెజిట్‌లో పేర్కొన్న కలెక్టరేట్లలో సోమవారం ఉదయం కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించాలని పేర్కొన్నారు. కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొట్టమొదటి అధికారిక కార్యక్రమంగా ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సిఎం కార్యాలయంలో  ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. కొత్త జిల్లాల కలెక్టర్లకు సిఎం అభినందనలు తెలియచేసి, ప్రభుత్వ పాలనా ప్రాధాన్యతల గురించి దిశా నిర్ధేశం చేశారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే కలెక్టర్లు జిల్లాలోని వివిధ స్థాయిల అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.దిల్లీరావు నియామకం

విజయవాడ కమిషనర్‌గా క్రాంతి రాణా టాటా కొనసాగింపు

విజయవాడ కమిషనర్‌గా క్రాంతి రాణా

ఎన్టీఆర్‌ జిల్లా

జిల్లా కేంద్రం : విజయవాడ. అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం)
రెవెన్యూ డివిజన్లు: విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త). మండలాలు : 20
తిరువూరు డివిజన్‌లో మండలాలు : రెడ్డిగూడెం, తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఎ.కొండూరు, మైలవరం
నందిగామ డివిజన్‌లో మండలాలు: నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరుళ్లపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి
విజయవాడ డివిజన్‌లో మండలాలు: ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ నార్త్, విజయవాడ ఈస్ట్, జి.కొండూరు
విస్తీర్ణం : 3,316 చ.కిమీ. జనాభా : 22.19 లక్షలు