- సొంత బలం పెంచుకోవడంపై దృష్టి
- ప్రాంతీయ పార్టీలు బిజెపిని దూరం పెట్టాలి
ఇకె నయనార్ నగర్ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : ఎన్నికల విజయాలకు మించిన లక్ష్యాలను తమ పార్టీ కలిగివుందని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ ఉద్ఘాటించారు. పార్టీ 23వ మహాసభలో నిర్మాణ నివేదిక ప్రవేశపెట్టిన ప్రకాశ్ కరత్ శనివారం మీడియా గోష్టిలో మాట్లాడుతూ, పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడం ద్వారానే మతోన్మాద విజెపిని దీటుగా ఎదుర్కోగలమని అన్నారు. పార్టీ సభ్యుల నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ 'హిందూ వేరు...హిందుత్వ వేరు. హిందుత్వను రాజకీయ పాచికగా చేసుకుని ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు ప్రజల మధ్య చీలిక తెస్తున్నాయని కరత్ విమర్శించారు. .ముస్లిం మతతత్వం ప్రమాదకరంగా మారిన చోట దానిపై కూడా పోరాడుతున్నామని చెప్పారు. గడచిన నాలుగేళ్లలో పార్టీ చేసిన పోరాటాలు నిర్మాణ నివేదికపై చర్చలో భాగంగా సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ కాలంలో రెండు ప్రధాన రాష్ట్రాలలో పార్టీ సభ్యుల సంఖ్య తగ్గిందని, దిద్దుబాటులో భాగంగా మిగిలిన చోట్ల కూడా సభ్యుల సంఖ్య తగ్గిందని చెప్పారు. కేరళ ఒక్కటే దీనికి మినహాయింపు అని తెలిపారు. సభ్యుల సంఖ్య తగ్గినప్పటికీ ఈ కాలంలో పార్టీ చొరవ పెరిగిందని, దేశంలో అత్యంత కీలకమైన రెండు ప్రధాన ఉద్యమాలల్లో పార్టీ శ్రేణులు చురుకైన పాత్ర పోషించాయని చెప్పారు. సిఎఎకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మొట్టమొదటి సారి మోడీ ప్రభుత్వ మతతత్వ విధానాలపై ప్రజలు గళం విప్పారని చెప్పారు. సుదీర్ఘకాలం పాటు జరిగిన ఈ పోరాటాన్ని కరోనా కారణంగా వాయిదా వేశారని చెప్పారు. రైతాంగ ఉద్యమాన్నీ ఆయన ప్రస్తావించారు. ఇవే కాకుండా, దేశ వ్యాప్తంగా జరుగుతున్న వివిధ పోరాటాలు, ఆందోళనల్లోనూ పార్టీ జోక్యం పెరుగుతోందని తెలిపారు. దీనిని మరింత ముందుకు తీసుకుపోవాల్సిఉందని చెప్పారు.
- పార్టీ ఎన్నికల ఓటములపై...
ఎన్నికల్లో ఓటములపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తమ పార్టీలో గెలుపుకైనా, ఓటమికైనా సమిష్టి బాధ్యత ఉంటుందని చెప్పారు. ఓటమికి ఏ ఒక్కరో కారణమని చెప్పలేమని అది తమ విధానం కాదని అన్నారు. అటువంటి ఫలితాలు వచ్చిన చోట ప్రజల విశ్వాసాన్ని పొందాల్సి ఉందని చెప్పారు. ఆ దిశలో పార్టీ శ్రేణులు దృష్టి సారించాయని తెలిపారు. నాలుగేళ్ల కాలంలో బెంగాల్‌లో సిపిఎం కార్యకర్తలను తృణమూల్ గుండాలు హత్య చేశారని, ఏకపక్షంగా చేసిన దాడుల్లో వేలాది మంది గాయపడ్డారని వివరించారు. త్రిపురలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. ఆ రెండు రాఫ్ట్రాల్లోనూ నిలదొక్కుకుని ఈ దాడులను తిప్పికొట్టాల్సి ఉందన్నారు.
- ఎన్నికల ఎత్తుగడలపై...
ఎన్నికల ఎత్తుగడలను అర్ధం చేసుకోవడంలో అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరిగాయని, వాటిని ఆ రాష్ట్రాల నాయకత్వ దృష్టికి తీసుకుపోయామని చెప్పారు.
- వివిధ రాష్ట్రాలలో సభ్యత్వ వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రం సభ్యత్వం 2018 2021
అండమాన్‌నికోబార్ 147 163
ఆంధ్రప్రదేశ్ 25,892 23,130
అస్సాం 12,454 11,644
బీహార్ 19,233 19,400
ఛత్తీస్‌గర్ 1,506 1,344
ఢిల్లీ 2,095 2,213
గోవా 45
గుజరాత్ 3,749 3,724
హర్యానా 2,521 2,191
హిమాచల్‌ప్రదేశ్ 2,239 2,205
జమ్మూకాశ్మీర్ 1.734 1,660
జార్ఖాండ్ 5,348 5,185
కర్నాటక 9,000 8,052
కేరళ 4,89,086 5,27174
మధ్యప్రదేశ్ 3,063 2,608
మహారాష్ట్ర 12,480 12,807
మణిపూర్ 431 451
ఒడిషా 4,361 3,647
పంజాబ్ 8,000 8,389
రాజస్థాన్ 5,211 5,218
తమిళనాడు 90,474 93,982
తెలంగాణ 35,560 32,177
త్రిపుర 73,678 50,612
ఉత్తరాఖండ్ 1,416 1,451
ఉత్తరప్రదేశ్ 5,678 5,368
పశ్చిమబెంగాల్ 1,92,454 1,60,827
సిసి సెంటర్










