Mar 04,2023 21:14

మాట్లాడుతున్న ఎస్‌పి విజయారావు

మాట్లాడుతున్న ఎస్‌పి విజయారావు
ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
నెల్లూరు :జిల్లాలో జరగబోయే ఎంఎల్‌సి ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌పి సిహెచ్‌ విజయరావు హెచ్చరించారు. శనివారం నగరంలోని ఎస్‌పి కార్యాలయంలో ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించి పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ పరంగా లభించిన ఓటు హక్కును అర్హత కలిగిన ప్రతి ఒక్కరు నిర్భయంగా వినియోగించుకోవాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావ్వివకుండా గట్టి బంధోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
జిల్లా పరిధిలో వచ్చే పోలింగ్‌ ప్రాంతాల గురించి, తీసుకునే ప్రణాలికలు గురించి, సున్నిత, సాధారణ పోలింగ్‌ కేంద్రాల గురించి, ఇప్పటి వరకు ఎన్నికలకు తీసుకున్న చర్యల గురించి, పోలింగ్‌ రొజున చేపట్టే పోలీసు బందోబస్తు, తదితర అంశాలను క్షుణ్ణంగా చర్చించి అధికారులకు దిశా నిర్దేశం చేశామన్నారు. ఇప్పటి వరకు బైండోవర్‌ చేసిన వ్యక్తుల వివరాలు, ఆయుధాలను ప్రతి ఒక్కరూ తప్పక డిపాజిట్‌ చేయాలని, ఎన్‌బిడబ్ల్యూ పెండింగ్‌ లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. గత ఎన్నికలలో నమోదు అయినా కేసుల వివరాలను తెలుసుకొని, పునరావతం కాకుండా కఠినంగా, అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశామన్నారు.