Mar 15,2023 20:50

- శిక్షణా తరగతుల్లో మాట్లాడుతున్న ఆచార్య వెంకట్రామిరెడ్డి

కడప అర్బన్‌ : జాతీయ సేవ పథకం నిధుల వినియోగంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్లు యోగివేమన విశ్వవిద్యాలయం ఎన్‌.ఎస్‌.ఎస్‌ సమన్వయకర్త ఆచార్య ఎన్‌.వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని జాతీయ సేవ పథకం ప్రోగ్రాం ఆఫిషర్ల కు పబ్లిక్‌ ఫైనాన్సియల్‌ మేనేజిమెంటు సిస్టం (పి.ఎఫ్‌.ఎం.ఎస్‌) గురించి ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విసి ఆచార్య రంగ జనార్ధన్‌, రిజిస్టార్‌ ఆచార్య వై.పి.వెంకటసుబ్బయ్య, ప్రిన్సిపల్‌ ఆచార్య కృష్ణారెడ్డి సహకారంతో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలో ఎన్‌ఎస్‌ఎస్‌ నిధులన్నీ ఆన్లైన్‌ విధానంలో పీవో లు ఖర్చు చెస్తారని పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగం అనేది ఉండదని చెప్పారు. రాష్త్ర ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు నిధుల మానిటరింగ్‌ నేరుగా చేయవచ్చన్నారు. విజయవాడ జాతీయ సేవా పథకం రాష్ట్ర కార్యాలయ రిసోర్స్‌ పర్సన్‌ దూపూడి మనోహరి, పి.శివకాంత్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ సెల్‌ మేనేజ్మెంట్‌ సిస్టం గురించి పి.పి. టి ద్వారా అవగాహన కల్పించారు. పిఓలకు సందేహ నివ త్తి చేశారు. శిక్షణా తరగతులలో విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్‌ పిఒలు పాల్గొన్నారు.