నిరసన తెలుపుతున్న దృశ్యం
ఎం.వి.ఐ చిన్నారావ్‌పై దాడి హేయం
నెల్లూరు:కాకినాడ సహాయ మోటార్ వాహనాల తనిఖీ అధికారి చిన్నారావ్ తనిఖీలో భాగంగా త్రై మాసిక పన్ను గురించి వాహన యజమానితో జరిగిన వాగ్వివాదం లో సదరు యజమాని అధికారిపై కొడవలితో విచక్షణారహితంగా దాడి పాల్పడటం అమానుషమని ఉపరవాణా కమిషనర్ శ్రీ చందర్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ఆర్‌టిఎ కార్యాలయం ఆవరణంలో రవాణా శాఖ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను, పన్ను కట్టని వాహనాలపై చర్యలు తీసుకునే క్రమంలో వాహన తనిఖీ అధికారులపై ఇలాంటి దాడులు హేయమని, ఇది దురదష్ట పరిణామం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ రవాణా శాఖ అధికారి ఇన్చార్జి కొర్రపాటి మురళీమోహన్ , మోటార్ వాహన తనిఖీ అధికారులు బాలమురళీకష్ణ, షేక్ బాబు, కార్తీక్ పవన్, సహాయమోటర్ వాహన తనిఖీ అధికారులు పూర్ణచంద్రరావు, రఘువర్ధన్ రెడ్డి, స్వప్నిల్ రెడ్డి పరిపాలన అధికారులు కిషోర్ కుమార్ మరియు వంశీకష్ణ సిబ్బంది పాల్గొన్నారు










