Nov 01,2023 23:13

ప్రజాశక్తి-మండపేట
భాగస్వాముల మధ్య విభేదాల తో వారం రోజులుగా మూతపడిన ప్రైవేట్‌ స్కూల్‌ ఎంపిఎస్‌ ను బుధవారం తెర వడంపై ఎంఎల్‌ఎ వేగుళ్ళ జోగేశ్వరరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి కె.కృష్ణవేణి, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రామ చంద్రపురం ఆర్‌డిఒ నేతత్వంలో కోర్టు వ్యవ హారాలకు పార్టీలకు సంబంధం లేకుండా స్కూల్‌ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టిన కలెక్టర్‌కు 1400 మంది విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. తొలుత ఆర్‌డిఒ ఎస్‌.సుధాసాగర్‌, మండల అభివృద్ధి అధికారి ఐదం రాజు, ఎంఇఒ నాయుడు రామచంద్రరావు తదితర జిల్లా కమిటీ సభ్యులతో కలిసి వెళ్లి పాఠశాల తరగతులను పరిశీలి ంచారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా పాఠశాల తెరిపి ంచేందుకు ఏర్పాటు చేసామన్నారు. ఈ రోజు హాజరు కాని విద్యార్థులకు తెలియజేసి వారిని కూడా తరగ తులకు హాజరయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమాల్లో మారేడుబాక సర్పంచ్‌ మట్టపర్తి గోవిందరాజు, టిడిపి పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు పాల్గొన్నారు.