ఎంజిఎసిలో రక్త నిర్థారణ పరీక్షలు
ప్రజాశక్తి-ఉదయగిరి : 27న ఉదయగిరి వ్యవసాయ కళాశాలలో మెగా రక్తదాన శిబిరానికి రక్త నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మేకపాటి గౌతంరెడ్డి ప్రభుత్వ వ్యవసాయ కళాశాల ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షులు సంయుక్తంగా పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎంజిఎసిలో విద్యార్థులకు రక్త నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 27న మెగా రక్తదాన శిబిరం 28వ తేదీన ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు కళాశాల డీన్ జి.కరుణాసాగర్, మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మనోజ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రక్తదానం చేసే ఔత్సాహికులు, విద్యార్థులు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. అలాగే ఇండియన్ డాక్టర్ సొసైటీ ఉదయగిరి బ్రాంచ్ చైర్మన్ షేక్.గాజుల ఫారుక్ అలీ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, విద్యార్థులంతా రక్తదానం అలవర్చుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రభుత్వ వ్యవసాయ కళాశాల మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో 172 మంది విద్యార్థులకు రక్తగ్రూపుల నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మేకపాటి గౌతమ్‌రెడ్డి వ్యవసాయ కళాశాల అధ్యాపకులు ఆచార్య డాక్టర్ టి.గోపికృష్ణ, డాక్టర్ మిట్టా కృష్ణతేజ, టెక్నీషియం రాఖీ, నఖీబ్, షఫీ, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.










