Feb 08,2023 22:04

విద్యార్థులను పరీక్షిస్తున్న వైద్యులు

       రొద్దం: మండలంలోని ఎంజెబి పాఠశాలలో డాక్టర్‌ ఎం జగదీష్‌ బాబు ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఎంజెబి పాఠశాలలో విషజ్వరాలు శీర్షికన ప్రజాశక్తి దినపత్రికలో బుధవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. డాక్టర్‌ జగదీష్‌ బాబు ఆధ్వర్యంలో పాఠశాలలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి అనారోగ్యంతో ఉన్న విద్యార్థులను పరీక్షించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది శ్రీనివాసులు, ప్రభాకర్‌, రూప, ఐశ్వర్య , మలేరియా సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ రమణతో పాటు ఎంజెబి ప్రిన్సిపల్‌ గోపాల్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.