కేక్ కట్ చేస్తున్న టిడిపి నాయకులు
ప్రజాశక్తి -కందుకూరు :టిడిపి ఎస్‌సి సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు పుట్టినరోజు వేడుకలు గురువారం టిడిప కార్యాలయంలో జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినట్లు నియోజకవర్గ ఎస్‌సి సెల్ అధ్యక్షులు రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. కందుకూరు పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు నార్నె రోశయ్య, నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి గోచిపాతల మోషే, బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిలకపాటి మధుబాబు, ఎస్సీ సెల్ నియోజకవర్గ నాయకులు దువ్వూరి రమేష్ చంద్ర, కసుకుర్తి నవరత్నం ఉన్నారు.










