పూజలు నిర్వహిస్తున్న కంచర్ల శ్రీకాంత్
ప్రజాశక్తి -కందుకూరు :ఎంఎల్‌సి కంచర్ల శ్రీకాంత్ దంపతులు బాపట్ల జిల్లాలోని చందోలులోని భగలముఖి అమ్మవారిని ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు ఎంఎల్‌స్సి కంచర్ల శ్రీకాంత్ దంపతులకు తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వచనం, అమ్మవారి శేష వస్త్రాన్ని, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం పొన్నూరులో శ్రీ విజ్ఞేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొన్నూరు టిడిపి నాయకులు, కార్యకర్తలు శ్రీకాంత్‌ను ఘనంగా సన్మానించారు. ఎంఎల్‌సి కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ చందోలులో ఉన్న శ్రీ భగలముఖి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.










