Mar 06,2023 20:51

మాట్లాడుతున్న ఎన్నికల పరిశీలకులు ఎస్‌హెచ్‌ కాటమనేని భాస్కర్‌


మాట్లాడుతున్న ఎన్నికల పరిశీలకులు ఎస్‌హెచ్‌ కాటమనేని భాస్కర్‌
ఎంఎల్‌సి ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
నెల్లూరు :ఎంఎల్‌సి ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలన్న ఆలోచనతోనే సూక్ష్మ పరిశీలకులను కేంద్ర ఎన్నికల కమిషన్‌ నియమించిందని ప్రకాశం..నెల్లూరు..చిత్తూరు జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు ఎస్‌హెచ్‌ కాటమనేని భాస్కర్‌, కోనా శిశిధర్‌లు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఆవరణంలోని తిక్కన ప్రాంగణంలో ఎంఎల్‌సి ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియలో పాల్గోనే సూక్ష్మ పరిశీలకుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన నిబంధనల ననుసరించి ఎంఎల్‌సి ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న సూక్ష్మపరిశీలకులకు వారు దిశా నిర్దేశం చేశారు. సుక్ష్మపరిశీలకులంతా ఎన్నికల మార్గదర్శకాలను అనుసరించి విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు.
శిక్షణా కార్యక్రమంలో తెలుసుకున్న విషయాలను ఖచ్చితంగా పాటిస్తూ ఎన్నికల విధి నిర్వహణలో ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు నిర్వహించాలని సూచించారు. ఈ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు మైక్రో అబ్జర్వర్‌ లు కీలకంగా వ్యవహరించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారి చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్‌ ప్రక్రియ జరుగుచున్నదా లేదా అని సూక్ష్మ పరిశీలకులు పరిశీలించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏమైనా ఇబ్బందులు తలెత్తితే పరిశీలకుల దష్టికి తీసుకురావాలని సూచించారు. ఎంఎల్‌సి ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘ మార్గదర్శకాలు, నిబంధనలు సక్రమంగా అమలు జరిగేలా మైక్రో అబ్జర్వర్‌ చూడాలని తెలిపారు. మైక్రో అబ్జర్వర్‌ డైరీ లోని నిబంధనలు పాటించాలని, చెక్‌ లిస్ట్‌ ప్రకారం సరిచూసుకోవాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి కె.వి.ఎన్‌ చక్రధర్‌ బాబు మాట్లాడుతూ, పోలింగ్‌ రోజున పోలింగ్‌ మొదలైనప్పటి నుండి పూర్తి అయ్యేంత వరకు పోలింగ్‌ ప్రక్రియను మైక్రో అబ్జర్వర్‌ సూక్ష్మ దష్టితో పరిశీలించాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా ఆబ్సెంట్‌, షిప్టింగ్‌, డెత్‌, డూప్లికేట్‌ ఓటర్స్‌ పై ప్రత్యేక దష్టి సారించాలని సూచించారు. పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో ఏదైనా సమస్య వచ్చిన లేదా సజావుగా పోలింగ్‌ జరగడం లేదని భావించిన వెంటనే సంబందిత మైక్రో అబ్జర్వర్‌, అబ్జర్వర్‌ దష్టికి, రిటర్నింగ్‌ అధికారి దష్టికి తీసుకురావాలన్నారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్‌ రోజున మైక్రో అబ్జర్వర్లు ఏ విధమైన విధులు నిర్వర్తించాలన్న అంశాలపై జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సాంబశివా రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా మైక్రో అబ్జర్వర్లకు వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా ఎస్‌.పి సిహెచ్‌ విజయ రావు, జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. కూర్మనాథ్‌, నగరపాలక సంస్థ కమీషనర్‌ హరిత, అడిషనల్‌ ఎస్‌.పి హిమవతి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, నుడా విసి టి. బాపిరెడ్డి, జడ్పి సిఈఓ చిరంజీవి, డిఆర్డీఏ, డ్వామా పిడీలు సాంబశివారెడ్డి, వెంకట్రావు, ఎపిఎంఐపి పిడి శ్రీనివాసులు, సోషల్‌ వెల్ఫేర్‌ డిడి వెంకటయ్య, ఎల్‌.డి.ఎం. శ్రీకాంత్‌ ప్రదీప్‌ కుమార్‌, సూక్ష్మ పరిశీలకులు తదితరులు పాల్గొన్నారు.