కడప ప్రతినిధి :కడప రీజియన్ పరిధిలోని మల్టీ లెవల్ హెల్త్‌ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పి) ఉద్యోగుల బదిలీల, నియామకాల్లో గోల్‌మాల్ కథ నడుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్‌లో భాగంగా ఎంఎల్‌హెచ్‌పి ఉద్యోగుల బదిలీలను పెద్దఎత్తున చేపట్టిన సంగతి తెలిసిందే. కడప రీజియన్ పరిధిలోని 3,106 మంది ఎంఎల్‌హెచ్‌పి ఉద్యోగుల్లో అర్హుల బదిలీలను ఏడు బ్యాచ్‌లుగా విభజించింది. మెరిట్స్, సీనియారిటీ, సీరియల్స్, ర్యాంకుల ఆధారంగా బదిలీలకు శ్రీకారం చుట్టింది. గతేడాది డిసెంబర్ 15న కడప రీజియన్ పరిధిలో సుమారు 324 మంది ఎంఎల్‌హెచ్‌పి ఉద్యోగుల బదిలీల ప్రక్రియను నిర్వహించింది. ఇందులో 240 మంది ఉద్యో గులను మాత్రమే మ్యాపింగ్ చేసింది. వేకెన్సీ స్థానాల నోటీస్‌ను విడుదల చేసింది. ఎంఎల్‌హెచ్‌పి ఉద్యోగులు వేకెన్సీ స్థానాలకు బదిలీలు కోరుకోవాల్సి ఉంది. ఆచరణలో ఆర్‌డి కార్యాలయం వేకెన్సీ నోటీస్‌లో పేర్కొన్న నింబధనలకు వ్యతిరేకంగా బదిలీల తంతును యథేచ్ఛగా సాగించడం విమర్శలకు ఆస్కారాన్ని కలిగించింది. ఉదాహరణగా చిత్తూరు జిల్లా రామకుప్పం పిహెచ్‌సి స్థానంలో రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్న స్వాతి అనే ఎంఎల్‌హెచ్‌పి స్థానానికి డిసెంబర్ 17న ఎనిమిదవ బ్యాచ్ కింద నియామకాలు చేపట్టింది మెరిట్, సీరియల్ నెంబర్ 13వ స్థానం, 134 మెరిట్ ర్యాంకు కలిగిన కవితను బదిలీ చేశారు. డిఎంహెచ్‌ఒ, ఆర్‌డి కార్యాలయ ఉన్నతాధికారులు నోటీస్‌లోని స్థానాలకు విరుద్ధంగా అరైవల్ స్థానానికి నియామకం చేయడంలోని ఉద్ధేశమేమిటో తెలియడం లేదనే వాదన వినిపిస్తోంది. కేవలం పొరపాటు కారణంగా చోటుచేసుకుందా, ఉద్దేశపూర్వకంగా చోటుచేసుకున్న ఘటనా అనేది విచారణ చేపడితే తేల నుంది. బదిలీ జాబితాలోని ఎంఎల్‌హెచ్‌పి ఉద్యోగులకు డిఎంహెచ్‌ఒ, ఆర్‌డి కార్యాలయాల నుంచి ఫోన్‌లు చేయడంలో ఆంతర్యమేమిటో తెలి యడం లేదనే వాదన వినిపిస్తోంది. బదిలీలు, నియామకాల వ్యవహారంలో ఉద్యోగ సంఘాల నాయకులను నియమించుకోవడం వల్ల పారదర్శకత ప్రశ్నార్థకంగా మారుతోందనే వాదన కొంతకాలంగా వినిపిస్తోంది. రీజియన్ పరిధిలోని ఆయా డిఎంహెచ్‌ఒల పరిధిలో పిహెచ్‌సి, రూరల్, సబ్‌సెంటర్ స్థానాల్లో ఎంఎల్‌హెచ్‌పి స్థానాల ఖాళీ లెన్ని ఉన్నాయో డిఎంహెచ్‌ఒ, పిహెచ్‌సి వైద్యులకు తెలియకుండా ఉంటుందా అనే సం దేహం వ్యక్తమవుతోంది. అరైవల్ స్థానాల ఎంఎల్‌హెచ్‌పి నుంచి బది లీలపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో కొత్తగా బదిలీపై వెళ్లిన ఎంఎల్ హెచ ్‌పిలు డిఎంహెచ్‌ఒ, ఆర్‌డి కార్యాలయాల చుట్టూ తిరగడం, వారిని కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందనే హెచ్చరికలు చేయడం భయాందోళనకు గురి చేసి వసూళ్ల పర్వానికి పాల్పడుతున్నారనే వాదన వినిపిస్తోంది. డిఎంహెచ్‌ఒ కార్యాలయంలో బదిలీలు, నియామకాల కౌన్సెలింగ్ ముగి సింది. మోడిఫికేషన్ ఉత్తర్వుల పేరుతో ఆర్‌డి కార్యాలయంలో బేరసా రాలు సాగించిన నచ్చిన స్థానానికి బదిలీలు చేస్తున్నారనే ఆరోపణలు వినిస్తున్నాయి. ఇందుకు ఆర్‌డి కార్యాలయంలోని ఇద్దరు సూపరి ంటెండెట్లను కాదని, జిజిహెచ్ నర్సింగ్ కళాశాలకు చెందిన సూపరి ంటెండెంట్‌ను నియమించుకుని యథేచ్ఛగా బదిలీల ప్రక్రియ సాగించడం ఆరోపణలకు బలం చేకూరుతోందనే వాదన ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తుండడం గమనార్హం. ఉమ్మడి కడప జిల్లాలో ముగ్గురు, అనం తపురం జిల్లాలో ముగ్గురు చొప్పున చిత్తూ రు, కర్నూలు జిల్లాలకు వెరసి సుమారు 15 మంది నుంచి 20 మంది ఎంఎల్‌హెచ్‌పి ఉద్యోగులను వేకెన్సీ జాబితా స్థానాల్లోకి బదిలీలు చేయకుండానే అరైవల్ స్థానాలకు బదిలీల ప్రక్రియ నడిచినట్లు సమాచారం. దీనిపై డిఎంహెచ్‌ఒ యూని యన్ నాయకులు కమిషనరేట్‌కు ఫిర్యాదు చేసే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
పొరపాట్లను సరిదిద్దుతాం
ఎంఎల్‌హెచ్‌పి ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో పొరపాట్లు చోటుచేసుకున్నాయని గుర్తించాం. వాటిని త్వరలోనే సరిదిద్దుతాం. డిఎంహెచ్‌ఒల నుంచి అందిన ఖాళీల ప్రక్రారమే బదిలీలు చేశాం.
- డాక్టర్ కోటేశ్వరి, ఆర్‌డి, కడప.










