May 15,2023 21:43

ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న ఎపిజెఎసి నాయకులు

ఎంఎల్‌ఎకు ఎపిజెఎసి వినతి
ప్రజాశక్తి-విడవలూరు : సమస్యలు ప్రభుత్వానికి చెబుదాం.. అంటూ ఎపిజెఎసి అమరావతి మూడవ దశ ఉద్యమ కార్యచరణలో భాగంగా సోమవారం ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ఎపిజెఎసి అమరావతి నెల్లూరు జిల్లా శాఖ వినతిపత్రం అందజేసింది. ఎపిజెఎసి అమరావతి నెల్లూరు జిల్లా శాఖ అసోసియేట్‌ చైర్మన్‌ ఈవీఎం శరత్‌ బాబు ఆధ్వర్యంలో కోవూరు గడపగడపకు కార్యక్రమంలో పాల్గొంటున్న ఆయనను కలిసి సమస్యను వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శరత్‌ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని 71 రోజులుగా ఉద్యమం చేపడుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు.
రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లాలోని అందరు ఎంఎల్‌ఎలు, ఎంపిలు వినతిపత్రం ఇచ్చి వారి ద్వారానైనా ప్రభుత్వానికి సమస్యను విన్నవించే విధంగా ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు అందజేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రంగా ముందుకు తీసుకుని వెళ్లనున్నట్లు శరత్‌ బాబు తెలిపారు. కార్యక్రమంలో అమరావతి జెఎసి నెల్లూరు జిల్లా టీం సభ్యులు ప్రధానోపాధ్యాయ సంఘం తరఫున వావిళ్ల హెడ్మాస్టర్‌ మురళీధర్‌, ఊటుకూరు హెడ్మాస్టర్‌ బుజ్జయ్య, ఎస్‌ఎల్‌టిఎ తరఫున మునీంద్ర, రఫీ, ఆఫీస్‌ బేరర్లు చైతన్య, శ్రీకాంత్‌, చిన్నయ్య, రమణయ్య, రాజేష్‌, రవీంద్ర, సత్యం, తదితరులున్నారు.