ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి జన్మదిన వేడుకలు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్‌రెడ్డి జన్మదిన వేడుకలను వైసిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. తొలుత పట్టణంలోని అన్నపూర్ణాసమేత విశ్వేశ్వరస్వామి ఆలయంలో పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, సిండికేట్ ఫార్మర్స్ సొసైటి చైర్మన్ నాగులపాటి ప్రతాప్‌రెడ్డిల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుల్తాన్ షాహిద్ దర్గాలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సర్థార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక చర్చిలలో వైసిపి ఎస్‌సిసెల్ జిల్లా అధ్యక్షులు కొండా వెంకటేశ్వర్లు, నాయకులు నందవరం ప్రతాప్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మొలబంటి రాజశేఖర్, మహబూబ్ బాషా, పొడమేకల పెంచలయ్య, చెరుకూరు కామాక్షయ్యనాయుడు, నాయకులు పెమ్మసాని శ్రీనివాసులునాయుడు, ఆండ్రా సుబ్బారెడ్డి, పుచ్చలపల్లి రవికుమార్ రెడ్డి, హరికిషోర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, సుబ్బారెడ్డి, చిన్నపరెడ్డి, జమ్రు, ముతీవర్, సయ్యద్ జమీర్ బాషా, సురేష్ యాదవ్, సురేంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ గోపారం వెంకటరమణమ్మ ఆధ్వర్యంలో విక్రమ్‌రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, పట్టణ వైసిపి కన్వీనర్ అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, వైస్ చైర్మన్లు షేక్ సర్థార్, డాక్టర్ కెవి శ్రావణ్ కుమార్, కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.










