Jan 08,2023 21:48

పాఠశాల సమస్యలను ఎంఎల్‌ఎకు వివరిస్తున్న హెచ్‌ఎం

ప్రజాశక్తి - లింగసముద్రం :మాలకొండ్రాయునిపాలెం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని పాఠశాల ప్రధానోపాద్యాయులు కెవి.క్రిష్ణారెడ్డి గ్రామానికి వచ్చిన ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌రెడ్డిని కోరారు. దీంతో స్పందించిన ఆయన పాఠశాలను పరిశీలించారు. పాఠశాల భవనం శిథిల వ్యవస్థకు చేరిందని,కొన్ని వసతులు లేవని దీని వల్ల విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని ఎంఎల్‌ఎకు వివరించారు. పాఠశాలకు కావాల్సిన వసతుల గురించి వినత పత్రం ఇవ్వాలని ఎంఎల్‌ఎ చెప్పారు. త్వరలోనే పాఠశాల సమస్యలను పరిష్కరిస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ఎంఇఒ రవికూమార్‌ ఉన్నారు.