May 02,2023 21:55

ఫొటో: ఉదయగిరి నియోజకవర్గ వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్థిని నేతలు

ఎంఎల్‌ఎ అభ్యర్థిని కలిసిన వైసిపి నేతలు
ప్రజాశక్తి-ఉదయగిరి : ఉదయగిరి నియోజవర్గ వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్‌ రెడ్డిని ఉదయగిరి, సీతారాంపురం, దుత్తలురు మండల నాయకులు కలిశారు. మగళవారం బెంగుళూరు తన నివాసంలో సీతారాంపురం మండల కన్వీనర్‌ చింతంరెడ్డి, శకునాలపల్లి సర్పంచ్‌ కల్లూరు వెంకటేశ్వరరెడ్డి, సీతారాంపురం సర్పంచుల సంఘం అధ్యక్షులు తిరుపతిరెడ్డి, సీతారాంపురం జేసిస్‌ మండల కన్వీనర్‌ బాలినేని మాబాయ్య, సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ
సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గం ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అమలు తీరు, జగనన్నే మా భవిష్యత్తు విజయవంత కార్యక్రమం పలు అంశాలను ఆరా తీశారు. వీరివెంట పలువురు వైసిపి నేతలు పాల్గొన్నారు.