Feb 03,2023 22:11

విలేకరుల సమావేశంలో పాల్గొన్న నాయకులు

ప్రజాశక్తి -పెనుకొండ : ఎమ్మెల్యే శంకరనారాయణను విమర్శించే స్థాయి టీడీపీ నాయకురాలు, కురుబ కార్పొషన్‌ మాజీ ఛైర్పర్సన్‌ సవితమ్మ కు లేదని వైసిపి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు.శుక్రవారం పెనుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసిపి మండల కన్వీనర్‌ నాగలూరు బాబు, ఎంపీపీ గీతా రామ్మోహన్‌ రెడ్డి, నగర పంచాయత్‌ చైర్మన్‌ ఫరూక్‌, సింగిల్‌ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి తదితరులు మాట్లాడారు. రాజకీయ గురువని సంబోధిస్తూ మాజీ ఎమ్మెల్యే బికె. పార్థసారధి పంచన చేరిన సవితమ్మ ఆయనకు వెన్నుపోటు పొడుస్తోందని ఆరోపించారు. కర్నాటక డీజిల్‌,పెట్రోల్‌ అక్రమ వ్యాపారం, క్వారీ, రైల్వే కాంట్రాక్టు పనుల్లో కోట్ల రూపాయల ప్రజా ధనం దోపిడీ చేసిన సవితమ్మ ఆమె భర్త వెంకటేశ్వరవు తమ అవినీతిని ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. ఇటీవల సిబిఐ అధికారులు సవితమ్మ ఇంట్లో సోదాలు నిర్వహించడం వారి అక్రమాలకు నిదర్శనం అని అన్నారు. అభివృద్ది కోసం శ్రమిస్తున్న ఎమ్మెల్యేను ఆయన సోదరులను విమర్శించడం ఆమె స్థాయికి తగదన్నారు.ఈ సమావేశంలో వైసిపి టౌన్‌ కన్వీనర్‌ బోయ నరసింహ, కౌన్సెలర్లు రఘనాథ్‌ రెడ్డి, భాస్కర్‌ నాయక్‌ , రామాంజినేయులు వెంకటరామి రెడ్డి, శ్రీనివాసులు, మారుతీ, శ్యామ్‌ నాయక్‌, సోమశేఖర్‌ రెడ్డి, రాజగోపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.