Feb 20,2023 20:48

- వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పటిష్టంగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ఆదేశించారు. సోమవారం విజయవాడ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాల కలెక్టర్లు, జెసిలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్‌ మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ గిరీష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పోలింగ్‌ స్టేషన్‌, కౌంటింగ్‌ ప్రపోజల్‌ పెండింగ్‌ లేకుండా త్వరగా పంపించాలన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ క్లైయిమ్స్‌, ఎఇఆర్‌ఒ, ఇఆర్‌ఒల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గ్రాడ్యుయేట్‌ ఫారం 7, టీచర్స్‌ ఫారం 8 పెండింగ్‌ లేకుండా త్వరగా పూర్తి చేయాలి అన్నారు. కౌంటింగ్‌ సెంటర్స్‌, బ్యాలెట్‌ బాక్సులు, ప్రింటింగ్‌ బ్యాలెట్‌ పేపర్స్‌ అన్ని సిద్ధం చేయాలన్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్స్‌, ఎంసిసి టీం ఎన్నికల ఉల్లంఘనపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. రిసెప్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ పైన ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలను తప్పక పాటించాలని కలెక్టర్‌ గిరీష్‌ పిఎస్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టభద్రుల, ఉపాధ్యాయుల క్లెయిమ్స్‌ డిస్పోజల్‌ పెండింగ్‌ లేకుండా త్వరగా పూర్తి చేయాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్స్‌, ఎంసిసి టీంలు పటిష్టంగా నిఘా ఉంచాలని ఆదేశించారు. మండల స్థాయి ఎంసీసీ టీములు నివేదికలను ఎప్పటికప్పుడూ అందించాలన్నారు. ఎన్నికల విధుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సత్యనారాయణ పాల్గొన్నారు.