Dec 20,2022 22:38

సమావేశంలో మాట్లాడుతున్న ఇంతియాజ్‌

ప్రజాశక్తి కదిరి టౌన్‌ : ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉద్యమ నాయకులకు ఆదరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని ఎన్జీవో హోంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై సమన్వయ సమావేశం నిర్వహించారు. పశ్చిమ రాయలసీమ పట్టుభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పోతుల నాగరాజు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న కత్తి నరసింహారెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపిద్దామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ సిపిఐ జిల్లా కార్యదర్శిి వేమయ్య యాదవ్‌ పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థులు కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగరాజు మాట్లాడుతూ కేంద్రంచ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో దోచుకోవడం దాచుకోవడమేనని పరమాధిగా పనిచేస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితులలో దోపిడీని ప్రశ్నించాలన్న నిలదీయాలన్న ఉద్యమ నాయకులను చట్టసభలకు పంపాల్సిన అవసరం ఉందన్నారు. స్వార్థపూరిత నాయకులు మతాల కులాల పేరుతో ప్రజలను విభజించి ప్రజల మధ్య విబేధాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. తప్పుడు వాగ్దానాలతో అధికారం చేపట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఉద్యమ నాయకులు కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగరాజుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడానికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వివి రమణ, జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌, జిల్లా ఉపాధ్యక్షులు జిఎల్‌ నరసింహులు, సాంబశివ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబ్జాన్‌, జగన్మోహన్‌, మాజీ ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, ఎఐటియుసి ఇసాక్‌, ఎఐకెఎస్‌ హనుమంత్‌ రెడ్డి, జీవీ రమణ, ఎఐవైఎఫ్‌ బిల్లుకుల్లాయప్ప, సాహితీసంస్థ కుమార్‌ స్వామి రెడ్డి, అంగన్వాడీసంఘం మాబున్నీసా తదితరులు పాల్గొన్నారు.